అటు క్రికెట్లో ఆల్ రౌండర్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సాధారణంగా బౌలర్లు కేవలం బౌలింగ్ కి మాత్రమే పరిమితం అవుతుంటారు. బ్యాటింగ్ చేయమంటే మాత్రం ఎంతో కష్టపడి పోతూ ఉంటారు. అదే సమయంలో బ్యాట్స్మెన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి అటు స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించ గలరు కానీ అటు వికెట్లు తీయడం అంటే మాత్రం మా వల్ల కాదు అంటూ చేతులేత్తేస్తూ ఉంటారు. కానీ ఆల్రౌండర్లూ మాత్రం ఒక వైపు బౌలింగ్ వికెట్లు పడగొడుతూనే మరోవైపు బ్యాటింగ్లో కూడా అదరగొడుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవలి కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక అతని ప్రదర్శన చూసిన తరువాత అసలు సిసలైన ఆల్రౌండర్ అనే పదానికి అతడే చిరునామా అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం సీనియర్ స్పిన్నర్ గా  మాత్రమే గుర్తింపు సంపాదించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. కానీ ఇప్పుడు మాత్రం స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేయడమే కాదు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కి వరంగా మారిపోయాడు అన్నది తెలుస్తుంది. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి అదరగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాటింగ్ లో కూడా రాణిస్తూ ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక కొన్ని మ్యాచులలో అయితే ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ చేస్తుండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య జరిగే మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్న ఈ సమయంలో 40 పరుగులతో అదరగొట్టాడు. ఇక మొత్తం 14 మ్యాచ్ లలో 153 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl