రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టడానికి ఒక అడుగు దూరంలో ఆగిన సమయంలో ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ అని కన్ఫర్మ్ చేసుకుంది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్, పరుగుల వీరుడు జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆదుకునే వారు ఎవరున్నారు అని అనుకుంటున్న సమయంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. పరుగులు రావడమే కష్టమైన దశలో ఎంతో ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు.


 మొత్తంగా 44 బంతుల్లో 59 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలోనే  టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అతనిపై ప్రశంసలు కురిపించాడు. జోస్ బట్లర్,  సంజు శాంసన్ ఈ సీజన్లో చాలా మ్యాచ్ లలో మంచి ఇన్నింగ్స్ ఆడారు. కానీ వాళ్లు విఫలమైతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక ఆ బాధ్యతను చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నారు. ముఖ్యంగా పవర్ ప్లే లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా షాట్స్ ఆడటం చూస్తే జోస్ బట్లర్, సంజూ శాంసన్ ల కంటే బెటర్ గా కనిపించాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి జైస్వాల్ కాస్త స్లో అయ్యాడు.


 ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే రాజస్థాన్ జట్టుకు ధోనీ ఇలాంటి ఫినిషెర్ ఎవరూ లేరు. అదృష్టవశాత్తూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన ఫినిషింగ్ ఇచ్చి అదరగొట్టాడు. ఇక ఒత్తిడిలో కూడా మెరుగైన ప్రదర్శన చేసిన యశస్వి జైస్వాల్ ను మెచ్చుకోకుండా అస్సలు ఉండలేమూ. అయితే అశ్విన్ తో కలిసి జైస్వాల్ మ్యాచ్ ఎండ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు ఒక యువ ఆటగాడు కలిసి మ్యాచ్ ను గెలిపిస్తే చూడటానికి ఎంతో బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.ఇక యశస్వి జైస్వాల్ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. మంచిగా ఆడుతున్నప్పుడు భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నించు.. తర్వాత మ్యాచ్ లో తొందరగా అవుట్ అయితే.  అవకాశం మళ్లీ రాకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: