ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా అద్భుతంగా రాణిస్తుంది  అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పేలవా ప్రదర్శన  చేసిన విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కారణంగానే చెన్నై గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది అన్నది ప్రస్తుతం అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటి పోయిన తర్వాత అటు కెప్టెన్సీ మళ్లీ ధోనీ చేతిలోకి వచ్చినప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ గట్టెక్క లేకపోయింది. అయితే ఇక ఈ ఏడాది ఇప్పటికే ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన నేపథ్యంలో ఇక ఇప్పుడు అందరిలో ఒకే ప్రశ్న తలెత్తింది.


 40 ఏళ్ల వయసు నిండిన ధోనీ వచ్చే సీజన్ ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందించారు. అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ కి ముందు.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో అందుబాటులో ఉంటానని.. మరింత బలంగా పుంజుకునీ మీ ముందు కి వస్తాను అంటూ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. దీంతో అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు అనే చెప్పాలి. ఇక ధోనీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.



 ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడినా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించాడు. అతను తీసుకుని సరైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. ధోని చెప్పినట్లుగానే ఇన్నాళ్లు తనని తను నడిపించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ని ఆదరించిన ఫ్యాన్స్ కు వచ్చే ఏడాది సొంత మైదానంలో కృతజ్ఞతలు చెప్పి ఇక వీడ్కోలు పలకాలని ధోని అనుకుంటున్నాడు. ఇది నిజంగా అభినందనీయం. వచ్చే ఏడాది ఈ లీగ్ దేశవ్యాప్తంగా 10 వేదికల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: