ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎప్పటిలాగానే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో తెర మీదికి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఎంతోబాగా సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ప్రతి మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకవైపు ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లు చేతులెత్తేసిన సమయంలో కూడా యువ ఆటగాళ్లు మాత్రం ఒత్తిడికి గురికాకుండా మంచి ప్రదర్శన కనబరిచారు అని చెప్పాలి.


 ఇలా ఈ ఏడాది తమ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రమణ దీప్ సింగ్ కూడా ఒకరు. ఇటీవలే తన బౌలింగ్లో అదరగొట్టాడు రమణ దీప్ సింగ్. అదే సమయంలో ఇక బాటింగ్ లో కూడా జట్టుకు ఎప్పుడూ అండగా నిలబడ్డాడు. ఇక ఎన్నో మ్యాచ్ ల తర్వాత తుది జట్టులో అవకాశం దక్కించుకున్న రమణ దీప్ సింగ్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.



 ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ లో ఒక లెజెండ్ అంటూ రమణ దీప్ సింగ్ కొనియాడాడు. తాను మ్యాచ్ ఆడుతున్న  సమయంలో రోహిత్ నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. బౌలింగ్ లో  బ్యాటింగ్లో మెరుగయ్యేందుకు సలహాలు కూడా ఇచ్చాడు. నెట్స్ లో రోహిత్ చెప్పిన విధంగానే సూచనలు పాటిస్తూ ప్రాక్టీస్ చేశాను. రోహిత్ నాతో చెప్పిన మాటలు విన్న తరువాత నాలో ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది.  నా మీద నాకు నమ్మకం పెరిగింది అంటూ రమణ దీప్ సింగ్ తెలిపాడు. కాగా నేడు ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ లో చివరి మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: