ఐపీఎల్ సీజన్ 15 లో  ఈ రోజు చాలా కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని కొన్ని జట్లలో రెండు ఢిల్లీ మరియు బెంగుళూరు లు.. అయితే ఈ సీజన్ లో అయినా టైటిల్ ను కైవసం చేసుకుని అభిమానుల నిరీక్షణకు తెర దించాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే అందుకు ముందుగా ఐపీఎల్ ప్యాటర్న్ ప్రకారం లీగ్ దశలలో జరిగే 14 మ్యాచ్ లలో మంచి ప్రదర్శన కనబరిచి లీగ్ దశ ముగిసే సమయానికి మొదటి నాలుగు స్థానాల్లో నిలవాలి. అంటే ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలి... అప్పుడే టైటిల్ పై ఆశ పెట్టుకోవాలి. కానీ ఇంకా ఢిల్లీ మరియు బెంగుళూరు జట్లకు ప్లే ఆఫ్ లో చోటు కంఫర్మ్ కాలేదు.

ప్రస్తుతానికి మాత్రం మూడు జట్లు ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకుని తర్వాత సమరానికి సిద్ధం అయ్యారు. ఆ జట్లలో మొదటి సారి ఐపీఎల్ లో అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉండగా, ఇంకొక జట్టు లక్నో సూపర్ జాయింట్స్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్ మొదటి సీజన్ లో ట్రోపీని సాధించిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలింది ఒక్క నాలుగవ స్థానం మాత్రమే. అయితే ఈ స్థానం ఎవరికి దక్కనుంది అని తెలియాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ ఫలితం వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుండగా గెలుపు కోసం రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలని బెంగుళూరు అభిమానులు మరియు ముంబై అభిమానులు ఇద్దరూ కోరుకుంటున్నారు. దీనితో ఢిల్లీకి ఒకే ఒక్క అభిమానం దక్కనుంది. సో... ఫ్యాన్స్ బలం మాత్రం ముంబై కి ఎక్కువగా ఉండనుంది. అయితే ఈ సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది చూడాలి. ఆత్యదిక ఫ్యాన్ బలం ఉన్న ముంబై ని ఢిల్లీ ఓడిస్తుందా అన్నది ఒక ప్రశ్నగా మిగిలింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: