ఈ రోజు ఐపీఎల్ లో జరగబోయే లీగ్ మ్యాచ్ లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ మరియు అయిదవ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నిజంగా ఒక ప్రీ ప్లే ఆప్స్ లాగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇలా ప్రత్యేకత ఉన్న ఈ మ్యాచ్ ను వీక్షించడానికి అభిమానులు కూడా చాలా ఆతృతగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రెండు జట్లు ఉన్న పరిస్థితిని చూస్తే ముంబై ఇండియన్స్ కన్నా ఢిల్లీ నే కొంచెం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రెండు జట్ల స్క్వాడ్ లు కంపేర్ చేసుకున్న ఢిల్లీ కి ఎక్కువగా పాజిటివ్ లు ఉన్నాయి.

మరి ఏయే విభాగాలలో ముంబై కన్నా ఢిల్లీ బలంగా ఉందో ఒకసారి చూద్దాం.

బ్యాటింగ్ : బ్యాటింగ్ పరంగా చూస్కుంటే ముంబై కన్నా ఢిల్లీ చాలా బెటర్ అని చెప్పాలి.. ఇప్పటి వరకు చూస్తే రోహిత్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పోలార్డ్ లాంటి వాళ్ళు ఉన్నా వరుస పరాజయాలను చవిచూశారు. దీనికి కారణం నిలకడ లేకపోవడమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.. రోహిత్ అయితే తన ఆటను పూర్తిగా మరిచిపోయాడా అన్నట్లు ఆడుతున్నాడు. ఇక ఇషాన్ కిషన్ మొదట్లో రెండు మ్యాచ్ లు తప్పితే టాలిక్ విఫలం అయ్యాడు. తిలక్ వర్మ ఒక్కడే ముంబై లో కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఢిల్లీ గురించి చూస్తే... ఓపెనర్లు వార్నర్ సర్ఫరాజ్ ఖాన్ దూకుడుకు మారుపేరు.. పవర్ ప్లే లో భారీగా పరుగు చేస్తున్నారు. ఇక వన్ డౌన్ లో మార్ష్ వచ్చి మ్యాచ్ ను శాసిస్తున్నాడు. ఇక పంత్ పావెల్ రూపంలో నాణ్యమైన హిట్టర్ లు ఉన్నారు. ఒకరు ఆడకపోయినా మరొకరు ఆడుతూ జట్టును విజయాలతో ఇక్కడ వరకు తీసుకువచ్చారు.

బౌలింగ్: బుమ్రా మునుపటిలా ప్రభావం చూపించలేకపోవడం బాధాకరం.. ఇక నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు అని చెప్పాలి. అందుకే తరచూ ముంబై బౌలర్లను మారుస్తూ ఉంటుంది. ఢిల్లీ కి అయితే ఈ సమస్య లేదు వారికి పేస్, స్పిన్ ఆల్ రౌండర్ లు అందరూ సమపాళ్లలో ప్రదర్సన చేస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నారు.

ఇలా చూసుకుంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. మరి ఏమి జరగనుదో తెలియాలంటే ఇంకాస్తసేపు వెయిట్ చేయాల్సింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: