ప్రతి ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టిక లో అగ్రస్థానం లో కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఏడాది మాత్రం అస్సలు కలిసి రాలేదు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా ఘోరమైన వైఫల్యాన్ని చవి చూసింది చెన్నై సూపర్ కింగ్స్. ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇవ్వకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు మూట గట్టుకుంది. కేవలం నాలుగు విజయాల తో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానం లో నిలిచింది.


 తొలుత రవీంద్ర జడేజా కెప్టెన్సీ లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీ లో బరి లోకి దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ చెన్నై జట్టు కు మాత్రం ఎక్కడా కలిసి రాలేదనే చెప్పాలి. అయితే ఎంతో నమ్మకం  తో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ చివరికి గాయం కారణం గా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అయితే మిగతా ఆటగాళ్లు అందరు జట్టుకు అందు బాటులో ఉన్న ఎందుకో పరాజయాల పరంపర మాత్రం కొనసాగింది. ఇదే విషయం  పై టీమిండియా మాజీ ఆటగాడు  అకాష్ చోప్రా స్పందిస్తూ చెన్నై ఆటతీరును విశ్లేషించాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇంతకంటే చెత్త సీజన్ మరొకటి లేదు  ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టిక లో 9వ స్థానంలో ఉంది. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ఏడాది చెన్నై తన మార్క్ అస్సలు చూపించ లేక పోయింది  దీపక్ చాహర్ గాయం కారణం గా దూరమైతే ఒక ప్లేయార్ దూరం అయినంత మాత్రాన మరీ ఇంత ఘోరం గా విఫలం అవ్వటం చెన్నై సూపర్ కింగ్స్కు తగదు అంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: