ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టులో సెలెక్ట్ అయిన తెలుగుతేజం తిలక్ వర్మ జట్టులో ఎంత కీలక ఆటగాడిగా ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకవైపు ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న అటు తిలక్ వర్మ మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా భారీ పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతడు టీమిండియాలో మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకోవడం ఖాయం అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.


 అయితే ముంబై ఇండియన్స్ జట్టులో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని తన వైపుకు ఆకర్షించిన తిలక్ వర్మ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. డబ్ల్యూ సీజన్లో ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు తిలక్ వర్మ. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన ఈ తెలుగుతేజం 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 29 ఫోర్లు 16 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే డెబ్యూ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ 2008లో 616 పరుగులు  చేసి టాప్లో కొనసాగుతున్నాడు.


 ఇక దేవ దత్త పడికల్ 2020లో 473 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 2015లో 439 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ ఏడాది ఐపీఎల్లో 397 పరుగులు చేసిన నాలుగో స్థానంలో నిలిచాడు  చివరగా ఐదో స్థానంలో రాహు త్రిపాటి 2017 లో 391 పరుగులు సాధించాడు.. కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ చేరకుండానే ఐపీఎల్ నుంచి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే.  కాగా ముంబై ఇండియన్స్ జట్టు తరపున కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl