భారత క్రికెట్లో హిట్ మాన్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఓపెనర్గా బరిలోకి దిగుతోంది మంచి ఆరంభం  ఇస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టు కెప్టెన్గా ముందుకు నడిపించడమే కాదు. ఒక ఆటగాడిగా కూడా జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. కానీ ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ మునుపటిలా బ్యాట్ ఝాలిపించ లేక పోతున్నాడు అన్నది అర్ధమవుతుంది. ప్రతి మ్యాచ్ లో కూడా తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నాడు రోహిత్ శర్మ.


ఈ ఏడాది ఐపీఎల్లో అయితే రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన అటు ముంబై ఇండియన్స్ కి గడ్డు పరిస్థితులు రావడానికి కారణం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మ్యాచ్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అటు కెప్టెన్గా కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అటు చివరి స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా కూడాచెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.


 ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. చివరి మ్యాచ్లో అయినా విజయంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ ముగించింది అని అభిమానులు సంతోషించారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెత్త రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ తో మ్యాచ్ లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తొలిసారి సీజన్ లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. 14 ఇన్నింగ్స్ లో కలిపి 268 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా 300 పరుగులు చేయకుండా రెండోసారి సీజన్ ముగించాడు. 2018లో 286 పరుగులు చేశాడు రోహిత్ శర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: