ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఎందుకో కెప్టెన్ గా కాస్త సక్సెస్ అయినట్లు కనిపించినా ఆటగాడిగా మాత్రం  సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పాలి   దూకుడైన ఆట తీరుకు  కేరాఫ్ అడ్రస్ అయిన రిషబ్ పంత్ ఈసారి అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు.. ఈ క్రమంలోనే  ఇక రిషబ్ పంత్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇటీవలే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో  జట్టు విజయం కోసం కెప్టెన్గా ఎంతో బాధ్యతాయుతంగా జట్టును ముందుకు నడిపించాలి. కానీ ఏకంగా పంత్ చేసిన కొన్ని తప్పులు జట్టు ఓటమికి కారణమయ్యాయి అని తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న మాజీ ఆటగాళ్లు, అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాలంటే ముంబై ఇండియన్స్ ను ఓడించాల్సిన పరిస్థితి  ఇక ఇలాంటి సమయంలో పేలవా ప్రదర్శన చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరికి తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. ముంబై చేతిలో ఓటమి చవిచూసి చివరికి ఇంటి బాట పట్టింది. ముఖ్యంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ చేతులెత్తేశాడు.


  ముప్పై మూడు బంతుల్లో 39 పరుగులు చేసి అనవసరమైన షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు రిషబ్ పంత్. జట్టు ఫీల్డింగ్ లో కూడా కుల్దీప్ ఓవర్లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు. దీంతో అతడు 37 పరుగులు చేసి ఏకంగా ఢిల్లీ ఓటమికి కారణం అయ్యాడు అని చెప్పాలి. ఇక శార్దూల్ ఠాకూర్ ఓవర్లో డేవిడ్ బ్యాట్ తగిలినా బంతిని  రిషబ్ పంత్ పట్టుకున్నాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ కు వెళ్లాలని ఫీడర్లు అందరూ కలిసి సూచించినా కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం వినిపించుకోలేదు. దీంతో అతను ఏకంగా 34 పరుగులతో రాణించాడు. ఇలా రిషబ్ పంత్ చేసిన తప్పిదాలు ఢిల్లీ జట్టుకు శాపంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl