ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్థానం ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఏడు విజయాలతో ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇటీవలే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడింది ఢిల్లీ కాపిటల్స్. తప్పకుండా విజయం సాధించి తీరుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయం సాధించి ఉంటే నేరుగా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశం ఉండేది  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం  పేలవ ప్రదర్శన చేసి చివరికి ఓటమి చవిచూసింది.


 దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టగా.. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరికి 7 విజయాలతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే ఇటీవల రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగానే ఓటమి పాలు అయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిచాడు. ఢిల్లీ కెప్టెన్ కెప్టెన్ గా పంత్ సరైన ఛాయిస్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. గత సీజన్ లోనే కాదు ఇప్పుడు కూడా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు అంటూ చెప్పుకొచ్చాడు.


 శ్రేయస్ అయ్యర్ దగ్గరనుంచి రిషబ్ పంత్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అద్భుతంగా రాణిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు అంటు రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.  రిషబ్ పంత్ చిన్నవాడని అయినప్పటికీ ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఒత్తిడిని అధిగమించి కెప్టెన్సీ చేపట్టి జట్టును ముందుకు నడిపించడం అమోఘం అంటూ కొనియాడాడు. ఏ ఆటగాడైనా చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే.. ఇంకా అతను నేర్చుకునే దశలో ఉన్నాడు. సెప్టెంబర్ ఈ విషయంలో రిషబ్ పంత్ ను నిర్మించడం సరైంది కాదు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: