మెగా టోర్నీ ఐపీఎల్ లో భాగంగా లీగ్ దశ ముగిసింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగబోతున్నాయ్. ఈ ప్లే ఆప్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇక ఈసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా కొత్త జట్టు నిలబడుతుంది అన్నది మాత్రం తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. స్వల్ప తేడాతో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతో అలవోకగా ప్లేఆఫ్ లో అడుగు పెట్టే సమయం అది. ఇలాంటి సమయంలోనే అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.


  ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్మెన్గా విఫలం కావడమే కాదు కెప్టెన్గా కూడా సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్  చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే అటు ఢిల్లీ కాపిటల్స్ ముంబై చేతిలో ఓడిపోయింది అన్నది అందరూ అనుకుంటున్న మాట. ముఖ్యంగా కీలకమైన సమయంలో రివ్యూ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు చివరికి జట్టు ఓటమికి కారణం అయింది అన్నది అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయంపై స్పందించాడు.  యూట్యూబ్ లో కెప్టెన్సీపై విమర్శలు చేశాడు


 డేంజరస్ బ్యాట్స్మెన్ జీరోకే అవుట్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకోరా అంటూ ప్రశ్నించాడూ రవి శాస్త్రి. అప్పటికి 5 ఓవర్లు మాత్రమే ఉన్నాయి చేతిలో రెండు రివ్యూలు  ఉన్నాయి. రిషబ్ పంత్ డిఆర్ఎస్కు వెళ్లకపోతే మిగతా జట్టు ఆటగాళ్లు ఏం చేస్తున్నారు అంటూ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఆ తప్పిదం కారణంగా చివరికి ఢిల్లీ ఓడిపోవాల్సినా పరిస్థితి వచ్చింది. ఒకవేళ రివ్యూ కి వెళ్లి ఉంటే ఢిల్లీది పైచేయిగా మారేది. ఈ తప్పిదం కారణంగా ఢిల్లీ ఆటగాళ్లు ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl