గత ఐపీఎల్ లో ఎటువంటి అంచనాలు లేని చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. అయితే ఈ సారి ఐపీఎల్ లో మాత్రం డిపెండింగ్ ఛాంపియన్ గా టోర్నీని స్టార్ట్ చేసిన చెన్నై ఊహించని విధంగా ఘోరంగా ఫెయిల్ అయ్యి మొత్తం 14 మ్యాచ్ లలో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. అయితే ఈ వైఫల్యం గురించి ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు తగు కారణాలను వివరించారు. అయితే అసలు ఎందుకు ఈ ఐపీఎల్ లో చెన్నై ఫెయిల్ అయింది అన్నది తెలుసుకుందాం.

* మొదటగా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే మూడు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని వైదొలగడం, అదే రోజున జడేజాను నూతన కెప్టెన్ గా ఎంపికవ్వడం మొదటి మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ధోని ఎప్పటి వరకు అయితే అడగలడో అప్పటి వరకు ధోని కెప్టెన్ గా ఉండడమే సరైన నిర్ణయం అని చెప్పాలి. అంతే కానీ ధోని టీమ్ లో ఉండగా వేరొకరు కెప్టెన్ గా ఉంటే సెట్ కాదు. ఇక్కడే చెన్నై యాజమాన్యం పప్పులో కాలేసింది.

* ఇలా జడేజా కెప్టెన్ గా అయ్యాక తన ఆటతీరు ఏమంత బాగోలేదు... అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ రెండింటిలోనూ విఫలం అయ్యాడు. ఇక జట్టును కూడా సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

* గత సీజన్ లలో చెన్నై కి అద్భుతమైన సేవలను అందించిన దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం బిగ్ మైన అని చెప్పాలి. అందుకే చెన్నై కి ఈ సీజన్ లో నాణ్యమైన బౌలింగ్ లేదని చెప్పాలి.

* గత సీజన్ లో అద్భుతంగా రాణించి ఆరంజ్ కాప్ ను దక్కించుకున్న చెన్నై ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో మాత్రం ఘోరం గా ఫెయిల్ అయ్యాడు.

* చెన్నై ఇన్ని టైటిల్ లు సాధించడంలో ధోని ది ప్రధమ పాత్ర... అయితే ఈ సీజన్ లో ధోని నుండి ఎటువంటి మెరుపులు లేవు. పైగా జడేజా నుండి కెప్టెన్సీ ధోనికి వచ్చే సమయానికి అంతా అయిపోయింది. ఇక వచ్చే సీజన్ లో అయినా ఏదైనా మాయ చేస్తాడా అన్నది చూడాలి.

* న్యూజిలాండ్ బ్యాట్స్మన్ అయిన డివాన్ కాన్ వే ను పూర్తిగా వాడుకోవడంలో చెన్నై విఫలం అయింది. ఆరంభంలో కేవలం ఒకటి రెండు మ్యాచ్ లలో విఫలం అయ్యాడని బెంచ్ కే పరిమితం చేసింది.

ఇలా పై కారణాల వలన క్లోజ్ మ్యాచ్ లు సైతం ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ లో వెనుకబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: