ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంత పటిష్టంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణించి ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.  ఈ క్రమంలోనే ఇక ఈ సీజన్లో లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడపోతుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు.  గుజరాత్ ఐటమ్స్ తో తలపడుతుంది. ఈ క్రమంలోనే కోల్కతా వేదికగా జరగబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం నిన్న రాజస్థాన్ రాయల్స్ బృందం ఏకమైన విమానంలో బయలుదేరింది.


 ఈ క్రమంలోనే ఒక్కసారిగా విమానంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు సిబ్బంది మొత్తం భయాందోళనతో ఊగిపోయారు అని చెప్పాలి.  వాతావరణ మార్పుల కారణంగా విమానంలోకి ఒక్కసారిగా దట్టమైన పొగమంచు వచ్చేసింది. దీంతో ఏం జరుగుతుందో అక్కడ ప్రయాణిస్తున్నా క్రికెటర్లకు అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే వెంటనే విమానం ల్యాండ్ చేయాలి అంటూ ఇక అదే ఫ్లైట్ లో ఉన్న ఒక ఆటగాడు గట్టిగా అరుస్తూ చెప్పాడు. పొగమంచు కాసేపటికే క్లియర్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



 ఒక విమానం ల్యాండ్ అయ్యే కాసేపటి ముందు హల్లా బోల్ హల్లా బోల్ అంటూ విమానం మొత్తం మార్మోగిపోయింది. ఇదే విషయాన్ని అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కోల్కతా పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానం మేఘాల నుంచి దూసుకుపోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: