గత కొంత కాలం క్రితం టీమిండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా  పేరు సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా  సరైన ప్రదర్శన చేయలేక చివరికి భారత జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అతని మునుపటి ఫామ్ అందుకోవాలంటే రంజిలలో ఆడడానికి పంపించింది బీసీసీఐ.  రంజీ ట్రోఫీలో అంతంత మాత్రంగానే ప్రదర్శన చేసిన చటేశ్వర్ పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లలో మాత్రమే అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. వరుస సెంచరీలు డబుల్ సెంచరీలతో  బౌలర్ల పై వీరవిహారం చేస్తూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే చటేశ్వర్ పుజారా ఆట తీరు చూసి అభిమానులు అందరూ కూడా ఆనందం లో మునిగి పోయాను. కాగా ఇక మరికొన్ని రోజుల్లో పుజారా టీమిండియా జట్టు కు సెలక్ట్ కావడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అందరూ. ఇక  అనుకున్నట్లుగానే ఇటీవలే భారత జట్టు ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు చటేశ్వర్ పుజారాకు జట్టు లో అవకాశం కల్పించారు. ఇంగ్లాండ్తో  గత ఏడాది మిగిలిన 5వ టెస్ట్ మ్యాచ్ లో పూజారా ఆడబోతున్నాడు.


 ఈ క్రమం లోనే ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన చటేశ్వర్ పుజారా జూలైలో ఇంగ్లాండ్తో జరిగే ఏకైక టెస్ట్ కు నన్ను ఎంపిక చేయడం ఎంతో బాగుంది. కౌంటీ క్రికెట్ లో నా ప్రదర్శన గుర్తించినందుకు సంతోషం గానే ఉన్నాను  ఇక్కడ బరి లోకి దిగి మైదానం లో పరుగులు చేయడం తో అది ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కి మంచి స్థితిలో ఉంచుతుంది అని నమ్మకం తోనే ఉన్నాను. ఎప్పటి లాగే ఈసారి కూడా ప్రాక్టీస్ కోసం ముందుకు సాగి .. అలాగే జట్టు విజయానికి కృషి చేయాలని అనుకుంటున్నా.. అంటూ చటేశ్వర్ పుజారా చెప్పుకొచ్చాడు.  గత ఏడాది కరోనా వైరస్ కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ రద్దు అయింది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: