ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్ టైన్మెంట్ పంచుతూన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇటీవలే లీగ్ మ్యాచ్ లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ లో ఎవరు విన్నర్ గా నిలబడుతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారి పోయింది. కాగా ముంబై పూణే లలో లీగ్ మ్యాచ్లు జరిగాయ్. కోల్కతా వేదికగా క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ.


 మొదట క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ లో బెంగళూరు లక్నో మధ్య  జరగబోతుంది. ఎలిమినేటర్ లో  గెలిచిన వారికి క్వాలిఫైయర్ లో ఓడిన వారికి ఆ తర్వాత ఎలిమినేటర్ 2 లో మ్యాచ్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం కోల్కతా లో ఉరుములు మెరుపుల తో కూడిన భారీ వర్షం కురుస్తున్న నేపథ్యం లో ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి అని చెప్పాలి.


 ఏకంగా తొలి మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ లో ఇటీవల భారీ వర్షం ఈదురు గాలులు కారణంగా ఏకంగా అద్దాలు మొత్తం ఊడి పడ్డాయి. స్టేడియం లో కొంత విధ్వంసం కూడా ఏర్పడిందని చెప్పాలి. ఐపీఎల్ సీజన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణం గా రద్దు కాలేదు. దీంతో మ్యాచ్ షెడ్యూల్ సమయం లో ప్రస్తుతం ఏం జరగ బోతుంది అనేది ఆసక్తికరం గా మారి పోయింది. ప్రస్తుతం కోల్కతాలో భారీ వర్షాల నేపథ్యం లో బిసిసిఐ ప్రత్యామ్నాయా లపై దృష్టి పెడుతుందా అన్న దానిపై కూడా చర్చ జరుగుతుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl