ఐపీఎల్ సీజన్ 15 లో రెండు కొత్త టీమ్ లు తమ కెరీర్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా రెండు జట్లు కూడా తాము ఆడుతున్న మొదటి సీజన్ లోనే ప్లే ఆప్స్ కు చేరుకోవడం వారి ఫ్రాంచైజీలకు హుషారు ఇచ్చే అంశం అని చెప్పాలి. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు అయితే సీజన్ ఆరంభం నుండు అద్వితీయమైన ఆటతీరును చూపుతూ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చింది. ఒక్క ముంబై చేతిలో ఓడిన ఆఖరి మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్ లోనూ తనదైన గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు చివరి అంకానికి తెరలేవనుంది.. రేపు కోల్కతా వేదికగా గుజరాత్ జట్టు రాజస్థాన్ తో క్వాలిఫైయర్ 1 లో తలపడనుంది.

అయితే లీగ్ స్థాయిలో ఆడే తీరుకు ప్లే ఆప్స్ లో ఆడే తీరుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ గెలిస్తేనే తర్వాత స్టేజ్ కు వెళ్ళేది. కానీ క్వాలిఫైయర్ లో మొదటిసారి ఓడినా మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంటుంది. కానీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు సీజన్ లో ప్రతి టీం ను డామినేట్ చేస్తూ వచ్చినా గుజరాత్ ఈ మ్యాచ్ లో సరైన పోటీ అంటే ఏమిటో రుచి చూడబోతోంది.

రాజస్థాన్ కూడా మంచి ఆటతో రెండవ స్థానానికి చేరుకుంది. గుజరాత్ కు రాజస్థాన్ కు రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరో మ్యాచ్ విన్నర్లు అని చెప్పాలి. రాజస్థాన్ కు శాంసన్ రూపంలో మంచి నాయకుడు  దొరికాడు అని చెప్పవచు. ఇక ఈ టీమ్ తో ఆడితేనే హార్దిక పాండ్య కెప్టెన్సీ బలం ఏమిటో ? అలాగే టీమ్ సత్తా ఏమిటో తెలుస్తుంది. మరి ఎవరు రేపు జరగబోయే మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరుతారు అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: