ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మ ఈ ఏడాది మాత్రం పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. కేవలం ఆటగాడిగా  మాత్రమే కాదు జట్టు కెప్టెన్గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ 14 మ్యాచ్ లలో 268 పరుగులు మాత్రమే చేశాడు  ఇక ఇందులో ఒక్క అర్థశతకం కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్ మొత్తంలో రోహిత్ శర్మ చేసిన వ్యక్తిగత అత్యధిక స్కోరు కేవలం 48 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.


 ఇక ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్ చేరకుండానే ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కి ముందు అటు రోహిత్ శర్మ జస్ప్రిత్ బూమ్రా విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్ల కు విశ్రాంతి ఇస్తున్నట్లు బిసిసిఐ సెలక్టర్లు ప్రకటించారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కు విరామం అవసరం లేదు మరోవైపు కోహ్లీ విషయానికొస్తే అతడు ఏడాదిన్నర కు పైగా అన్ని ఫార్మాట్లకు అతీతంగా క్రికెట్ ఆడుతున్నాడు.ఎక్కడ విశ్రాంతి తీసుకో లేదు.


 రోహిత్  మాత్రం గాయాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత జట్టుకు దూరమయ్యాడు అని తెలుస్తోంది. టి20 ప్రపంచకప్ తర్వాత కూడా ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ శర్మ సగంలోనే హాజరయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా కు పూర్తిగా దూరమయ్యాడు. కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్  నుంచి నిష్క్రమించాక సుమారు రెండు వారాల సమయం ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళేముందు అతనికి విరామం ఇస్తే చాలు అంటూ రవిశాస్త్రి ఒక క్రీడా చానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: