సురేష్ రైనా.. భారత జట్టులో ఎంతో ప్రత్యేకమైన ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.  అద్భుతమైన ప్రతిభతో  కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకు కెప్టెన్గా ఉన్న సమయంలో సురేష్ రైనా ప్రదర్శన ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత కాలంలో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కారణంగా ఇక సురేష్ రైనా కూడా అటు టీమిండియాలో అవకాశాలు తగ్గిపోయాయడని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత కాలంలో టీమిండియాకు దూరమైనప్పటికీ అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎప్పుడూ మంచి ప్రదర్శన కనబరిచాడు. తన సన్నిహితుడు అయిన ధోని రిటైర్మెంట్ ప్రకటించగానే నీతో నేను అంటూ తాను కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు సురేష్ రైనా. ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో ఎంత కీలక పాత్ర వహించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు సురేష్ రైనా. ఇలాంటి సురేష్ రైనాకు చెన్నై యాజమాన్యానికి అంతగా పొసగక పోవడంతో చివరికి అతని పక్కన పెట్టేసింది.


 ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ముందు సురేష్ రైనా ను మెగా వేలంలో కి వదిలేసి మళ్ళీ కొనుగోలు చేయలేదు. దీంతో అతడు ఐపీఎల్ కే దూరమయ్యాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ లో సురేష్ రైనా లేని లోటు బాగా కనిపించింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేష్ రైనా అద్భుతమైన బ్యాట్స్మెన్  గా సత్తా చాటుతున్నాడు  మూడో స్థానంలో బరిలోకి దిగుతు రాణిస్తున్నాడు. చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించేవాడు అంటూ గుర్తుతీసుకున్నాడు. ఇప్పటి నుంచి చెన్నై గెలవాలంటే సురేష్ రైనా లాంటి ఆటగాడిని గుర్తించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: