ఇటీవల కాలంలో అటు భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న యువ ఆటగాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇలా ఆల్రౌండర్గా సత్తా చాటుతున్న వాళ్లలో వాషింగ్టన్ సుందర్ కూడా ఒకరు.. ఐపీఎల్ ద్వారా తన ప్రదర్శన తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత కాలంలో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఒకవైపు తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేయడమే కాదు మరోవైపు కీలక సమయంలో మ్యాచ్ గెలిపిస్తూ అదరగొడుతున్నాడు. అతని ప్రతిభకు అటు సీనియర్లు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతని ప్రదర్శన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ ఏడాది కూడా ఎంతో మెరుగైన ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైనప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడు యువ ఆల్రౌండర్. ఇకపోతే వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రతిభ పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 వాషింగ్టన్ సుందర్ రానున్న రోజుల్లో భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఎదుగుతాడు అంటూ రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అన్ని ఫార్మాట్లలో కూడా సత్తా చాట గలడు  అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు యువ ఆటగాడు అయినప్పటికీ క్రికెట్ పట్ల అతనికి ఉన్న అవగాహన మాత్రం ఎంతో అమోఘం అంటూ తెలిపాడు రవి శాస్త్రి. ఇక షాట్ సెలక్షన్లో వాషింగ్టన్ సుందర్ కి తిరుగు లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం భారత జట్టులో ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ టీమిండియాలో ప్రీమియర్ ఆల్రౌండర్గా ఎదుగుతాడు అంటూ రవిశాస్త్రి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: