టీమ్ ఇండియా లో ఎంతో మంది స్పిన్నర్లు ఉన్నా అటు రవిచంద్రన్ అశ్విన్ కి మాత్రం ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే అతను వేసే స్పిన్ బౌలింగ్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. బ్యాట్స్మెన్ లకు  అర్థం కాని జిమ్మిక్కు ఉంటుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు తీయగల సత్తా అతని సొంతం అని చెప్పాలి. టీమ్ ఇండియా లో అయినా ఐపీఎల్ లో అయినా అతడు ఎప్పుడూ అదరగొడుతు ఉంటాడు. ఇక ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ మొదటి నుంచి ఎంతో నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. అయితే బౌలింగులో 11 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాటింగ్ లో కూడా అదరగొట్టాడు అని చెప్పాలి.


 14 మ్యాచ్ లలో కీలక సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 183 పరుగులతో రాణించాడు. కాగా నేడు రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లో అడుగు పెడుతూ ఉంటుంది. ఇక ఓడిన జట్టు క్వాలిఫైర్ రెండు లో ఆడుతుంది. కాగా ప్రాక్టీస్ లో  మునిగితేలిన రవిచంద్రన్ అశ్విన్ కాసేపు మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఐపీఎల్లో ఎప్పుడూ లేనంత హ్యాపీగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అంటూ తెలిపాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడటం కొత్తగా అనిపిస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తూ రాబోయే మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును ఓడించటమే మా లక్ష్యం. ఇక ఐపీఎల్ లో రిటైర్డ్ అవుట్ అనే పదాన్ని నా తోనే మొదలు పెట్టడం ఇక కెప్టెన్ నన్ను నమ్మి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లాంటివి ఎంతో ఎక్స్పెరిమెంటల్ అనిపించాయి. ఎప్పుడైతే నేను ప్రయోగాలు చేయడం ఆపివేస్తానో.. అప్పుడే క్రికెట్ పై ఉన్న ఫ్యాషన్ కూడా నాలో చచ్చిపోతుంది. క్రికెట్ ఆడినంత కాలం ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాను అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: