అయితే సరిగ్గా ఐపీఎల్ మెగా వేలానికి ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య ఒక్క సారిగా పుంజుకుని కెప్టెన్సీ లో అదరగొట్టడమే కాదు ఒక ఆటగాడిగా కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదండోయ్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకున్న మొదటి జట్టుగా గుజరాత్ కి ఒక అరుదైన రికార్డు సాధించిపెట్టాడు. ఏకంగా 14 మ్యాచులలో పది విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో జట్టును నిలిపాడు.
కాగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి వందకు వంద మార్కులు ఇస్తాను. అతను ఒక గొప్ప నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్ల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సాధారణంగా కొన్ని సందర్భాలలో బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ సమయంలోనే కెప్టెన్ వారి పక్కనే నిలబడి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే వారికి ఊరట అనిపిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా ఇదే చేసి చూపించాడు. హార్దిక్ కెప్టెన్సీ వల్లే గుజరాతి జట్టు ఉన్నత శిఖరానికి వచ్చింది అంటూ ప్రశంసలు కురిపించాడు..