ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా గుర్తింపు సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేక పోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనకు జడేజా కెప్టెన్సీ కారణమంటూ అందరు విమర్శలు చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. దీంతో జడేజా కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకోలేక పోయాడు. దీంతో ఒత్తిడి లో తన ఫామ్ కూడా కోల్పోయాడు. తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకొని ధోనీకి అప్పగించాడు.


 అయితే ఇలా కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకున్న తర్వాత గాయం కారణం గా జట్టుకు కూడా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరు సంపాదించుకున్న రవీంద్ర జడేజా ఆటగాడిగా పేలవ ప్రదర్శన చేయడం జట్టుకు ఎంతో మైనస్ గా మారి పోయింది. అయితే జడేజా లాంటి ఆటగాడిని మరొకరిని వెతికి తీసుకు రాలేమూ అంటూ అటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒక మ్యాచ్ సందర్భం లో చెప్పాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే రవీంద్ర జడేజా ఫామ్ గురించి ఇటీవలే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. ఆఖరి మ్యాచ్ లలో కూడా ఆడలేదు. దీనిపై ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో అలాగే ఉండి పోయాయి. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను రిలీజ్ చేస్తే ఆ జట్టు యాజమాన్యానికి 16 కోట్లు మిగులుతాయి ఏమోకానీ.. అలాంటి ఆటగాడు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్  ఎంత వెతికినా మళ్ళీ దొరకడు అంటూ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. అదే సమయం లో సీనియర్ బౌలర్ బ్రావో స్థానం లో యువ ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: