రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు సంజూ శాంసన్ . ఇక ప్రతి ఏడాది సంజు శాంసన్ ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎందుకో జట్టుకు అంతగా కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది మాత్రం సంజు శాంసన్ కు తోడుగా మరికొంతమంది బ్యాటర్ లు కూడా రావడంతో జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం కూడా ఎంతో పటిష్టంగానే ఉంది. ఇక ఐపీఎల్ సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేసింది లీగ్ మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. కానీ ఈ ఏడాది మొత్తం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్ లక్కీ గానే మిగిలిపోయాడు అని తెలుస్తోంది.  ఇలా సంజూ శాంసన్ అన్ లక్కీ రికార్డును తిరగ రాశాడు. అదేంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. వరుస విజయాలు సాధిస్తోంది. ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ అన్ లక్కీ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారు కదా.  జట్టు బాగా రాణిస్తున్నప్పటికీ అటు టాస్ విషయంలో మాత్రం ప్రతి సారి రాజస్థాన్ రాయల్స్ కు నిరాశే ఎదురైంది. టాస్ గెలిస్తే తమ వ్యూహాలను మరింత పటిష్టంగా  అమలు చేయవచ్చు అనుకున్న సంజు శాంసన్ కి ఐపీఎల్లో ఎక్కువ సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ఒక సీజన్లో అత్యధిక సార్లు టాస్ ఓడి పోయిన కెప్టెన్గా రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ నిలిచాడు. ఈయేడాది ఐపీఎల్ సీజన్ లో 13 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ లో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయి తద్వారా ఈ అన్ లక్కీ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ 2012 సీజన్లో 12 సార్లు టాస్ ఓడిపోయాడు . అయితే ఇలా వరుసగా టాస్ ఓడి పోయిన  అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్రస్థానాన్ని అద్భుతంగా సాగించింది అని చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా తమ ప్రదర్శన తో ఆకట్టుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు..

మరింత సమాచారం తెలుసుకోండి: