ఐపీఎల్ లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేసిన జట్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టింది గుజరాత్. మొదటి మ్యాచ్ నుంచి అద్భుతమైన ప్రదర్శన తో పాయింట్ల పట్టికలో ఎప్పుడు టాప్ ప్లేస్ కొనసాగుతూ వచ్చింది. గుజరాత్ ప్రదర్శన ముందు మిగతా అన్ని తేలిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.


 హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తిరుగులేని ప్రస్థానం కొనసాగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకున్న మొదటి జట్టుగా కూడా గుజరాత్ టైటాన్స్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి క్వాలిఫయర్లో మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టినా తొలి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది.  ఇక గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరిపోవడంతో మరో మూడు మ్యాచులు జరగాల్సి ఉంది. నాలుగు రోజుల వరకు కూడా మంచి రెస్టు దొరికింది అని చెప్పాలి. కాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడ్డాయి.


 ఇక్కడ గెలిచిన జట్టు రెండవ క్వాలిఫైయర్ లో మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ రెండో క్వాలిఫయర్లో గెలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడబోతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ లో 29వ తేదీన జరగబోతుంది. ఈ క్రమంలోనే విజయోత్సాహంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తనదైన శైలిలో ఒక పోస్టు పెట్టింది. లేట్ నైట్ థాట్స్ అంటు హ్యాష్ ట్యాగ్ పెళ్లిపోస్ట్ చేసింది. నాలుగు రోజులు సెలవులు ఏం చేయాలో అంటూ కామెంట్ చేయగా.  గుజరాత్ వైస్ కెప్టెన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ స్పందిస్తూ నిద్రపో అంటూ స్మైలీ ఎమోజితో బదులిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: