నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్  ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారో అన్నది ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. కోహ్లీ, డుప్లెసిస్,మాక్స్వెల్, దినేష్ కార్తీక్ ఇలా అందరూ ఔట్ అయ్యారు. ఇక ఆర్సిబి గెలవడం కష్టమైనా అని  అభిమానులందరూ నిరాశలో మునిగిపోయారు.


 ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్లు ఎవరి పైన కూడా అంచనాలు లేవు అని చెప్పాలి. అలాంటి సమయంలోనే క్రీజ్లోకి వచ్చిన రజత్  కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన ప్రతిభను వెలికి తీశాడు. ఏకంగా శతకంతో మెరిసాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు 2 సిక్సర్లతో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  బెంగళూరు జట్టు తరఫున పలు రికార్డులు కూడా నమోదు చేశాడు అని చెప్పాలీ.


 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున నాకౌట్ మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా రజత్  నిలిచాడు. అంతే కాకుండా ప్లే ఆఫ్ లో ఆర్సిబి తరుపున అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా కూడా రజత్ నిలవడం గమనార్హం. గతంలో క్రిస్ గేల్ బెంగళూరు తరఫున ప్లే ఆఫ్ మ్యాచ్ లో 89 పరుగుల సాధించగా ఇక ఇప్పుడు రజత్ 112 పరుగులు చేశాడు. అన్ క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ ఐపీఎల్ లో సెంచరీ అందుకున్న నాలుగొ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అన్ క్యాప్డ్ అయినప్పటికీ ప్లే ఆఫ్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రజత్ నిలవడం గమనార్హం. అన్ క్యాప్డ్ ప్లేయర్గా అత్యధిక స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా కూడా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: