ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కొత్త గా ఎంట్రీ ఇచ్చిన జట్లలో అటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒకటి. మొదటి నుంచి అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన లక్నో జట్టు అటు కీలక మ్యాచ్లో మాత్రం తడబడింది అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో టైటిల్ గెలుస్తుంది అనుకునే లాగే కనిపించిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయి ఇక ఇంటి బాట పట్టింది. దీంతో లక్నో సూపర్ జెంట్స్ అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి.



 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేవలం 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. అంతేకాదండోయ్ బెంగళూరు జట్టు విజయానికి  లక్నో ఫీల్డ్ తప్పిదాలు కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో కీలకమైన క్యాచ్ లను వదిలేసారు లక్నో ఫీల్డర్లు. ముఖ్యంగా సెంచరీతో అదరగొట్టిన రజత్ క్యాచ్ లను కూడా వదిలేయడంతో అది లక్నో జట్టుకు శాపంగా మారి పోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల ఓటమిపై స్పందించాడు లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫీల్డింగ్ బాగా చేసిందని తాము మాత్రం పెండింగ్లో వెనుకబడ్డామని.. కె.ఎల్.రాహుల్ తెలిపాడు. క్యాచ్లు వదిలేయడం ఓటమికి ప్రధాన కారణం గా మారిపోయాడు అంటూ తెలిపాడు. ఏదైనా జట్టులో టాప్ త్రీ ఆటగాళ్లలో ఎవరైనా సెంచరీ చేస్తే ఆ జట్టు కచ్చితంగా గెలుస్తుంది. రజత్ అద్భుతం గా ఆడాడు. మేము చాల పొరపాటు చేశామూ.. మా తప్పులను సరిదిద్దుకుని వచ్చే సీజన్లో మళ్లీ మెరుగ్గా రాణించడంతో ప్రయత్నిస్తాము అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: