సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే అటు బ్యాట్స్ మెన్ లదే పైచేయి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్  కూడా ప్రతి బంతిని బౌండరీకీ తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇలా విజృంభించి ఆడే బ్యాట్స్మెన్లను కట్టడి చేయడానికి ఎంతో వైవిధ్యమైన బంతులు సందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక బౌలర్ ప్రతిభకు టీ20 ఫార్మాట్ అసలు సిసలైన సవాలు విసురుతూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా టీ-20 ఫార్మెట్లో బౌలింగ్ చేయడం ఒక ఎత్తు అయితే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం మరో ఎత్తు అని చెప్పాలి.


 ఎందుకంటే అప్పటివరకూ ఆచితూచి ఆడిన బ్యాట్స్మెన్లు  అందరూ కూడా డెత్ ఓవర్ లుగా పిలుచుకునే 15 నుండి 20 ఓవర్లలో మాత్రం మరింత చెలరేగి ఆడుతూ ఉంటారు.  సింగిల్స్ కి వెళ్ళకుండా ప్రతి బంతిని బౌండరీ తరలించడానికి ప్రయత్నిస్తు ఉంటారు. ఇలాంటి సమయంలో పరుగులు కట్టడి చేయడమే చాలా కష్టం అంటే ఇక డాట్ బాల్స్ వెయ్యటం మాత్రం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే డెత్ ఓవర్ లలో మెరుగైన బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్  వేసి ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న బౌలర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


 ఐపీఎల్లో రాలేదు చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో 50 డాట్ బాల్స్ వేసిన ప్లేయర్గా ఏకంగా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 43 డాట్ బాల్స్ తో  రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రసీద్ కృష్ణ 39 డాట్ బాల్స్, జస్ప్రిత్ బూమ్రా ముప్పై నాలుగు డాట్ బాల్స్, ఆవేష్ ఖాన్   33 డాట్ బాల్స్ తో  డెత్ ఓవర్ లలో  ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా టాప్ లో కొనసాగుతూన్నారు. ఇలా ఎక్కువ డాట్ బాల్స్ వేసిన  బౌలర్ లలో అందరూ కూడా ఫాస్ట్ బౌలర్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl