ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగం గా ఇటీవలే రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కాస్త జోరు మీద కనిపించడం తో మంచి విజయం సాధించడం పక్క అని అందరూ అనుకున్నారు. టైటిల్ విజేత గా నిలుస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ బెంగళూరు జట్టు మరో సారి ప్రేక్షకులందరికీ నిరాశే మిగిల్చింది. రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడి పోయి టైటిల్ గెలుస్తుందన్న ఆశలను అడియాశలు చేసేసింది.


  ఈ క్రమం లోనే అభిమానులకు నిరాశ తప్పు లేదు అని చెప్పాలి. అయితే ఎంతో ఉత్కంఠ భరితమైన పోరులో అటు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ బట్లర్ పోరాటం తోనే అటు రాజస్థాన్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే బెంగళూరు జట్టు లో కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రమే చెత్త రికార్డును ఖాతా లో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు మహమ్మద్ సిరాజ్.


 ఐపీఎల్ సీజన్ లో అత్యధికం గా ఏకంగా 30 సిక్సర్లు సమర్పించుకున్నాడు ఈ బౌలర్. కాగా 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బ్రావో 29 సిక్సర్లు  సమర్పించుకున్నారు. కాగా ఇప్పుడు వరకు ఇదే అత్యధిక సిక్సర్లు గా కొనసాగగా.. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో పరుగులు కట్టడి చేయాల్సిన సమయం లో భారీగా పరుగులు సమర్పించుకుని పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు మహమ్మద్ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl