బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అదే సమయంలో అటు మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ అనే ఒక టోర్నీ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అచ్చం ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే  ఈ టోర్నీ కూడా జరుగుతుంది. కానీ కేవలం మూడు జట్లు మాత్రమే ఇందులో పాల్గొంటాయి.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది మహిళా క్రికెటర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటుతున్న నేపథ్యంలో అటు మహిళల క్రికెట్ కు మరింత ప్రేక్షకాదరణ పెంచేందుకే ఇక ఇలాంటి లీగ్ నిర్వహించేందుకు నిర్ణయించింది బీసీసీఐ. ఇకపోతే ఇటీవలే ప్రారంభమైన ఈ మహిళల టి20 ఛాలెంజ్ లీగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ లీగ్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సంగబోతుంది. కాగా నేడు ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.



 ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భాగంగా హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్నోవా, దీప్తి శర్మ కెప్టెన్సీలో అదరగొడుతున్న వెలాసిటీ జట్లు హోరాహోరీగా తలపడి టైటిల్ విజేత గా నిలిచెందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా రన్ రేట్ తక్కువగా ఉండటం కారణంగా అటు స్మృతి మందాన కెప్టెన్సీ వహిస్తున్న ట్రయల్ బ్లేజర్స్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించి చివరికి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మొన్న మెరుపులు మెరిపించి అదరగొట్టేసినా కిరణ్ నవ్ గిరే పైన ప్రస్తుతం ప్రేక్షకులు అందరి దృష్టి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: