చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతి మ్యాచ్లో కూడా పేలవ ప్రదర్శనతో ఓటమి చవి చూసింది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టకుండా అనే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదండోయ్ మొదట జడేజాకు కెప్టెన్సీ అందించడం ఆ తర్వాత ధోనీ చేతిలోకి రావడం ఇలా చెన్నై జట్టు లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్లే ఆఫ్ చేరకుండా చెన్నై సూపర్ కింగ్స్ వెనుదిరగడంతో అభిమానులు నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఆ జట్టు త్రో డౌన్ స్పెషలిస్ట్ కొండప్ప రాజ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 కొండప్ప రాజు గత కొంత కాలం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు త్రో బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల అతను చెన్నై సూపర్ కింగ్స్ టీం తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తాను మొదటిసారి మహేంద్రసింగ్ ధోనినీ కలిసి లక్షణాలను అప్పుడు అతడు చెప్పిన మాటలు కూడా ఇటీవలే గుర్తుచేసుకున్నాడు కొండప్ప రాజు. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే అతన్ని మొదటి సారి కలిశాను అంటూ తెలిపాడు. ఇక అప్పుడే చెన్నై క్యాంపు కూడా మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు.



 ఈ క్రమంలోనే నాకు త్రో బౌలింగ్ చేస్తావా అంటూ మహేంద్ర సింగ్ ధోనీ నన్ను అడిగాడు. దాంతో నేను సరేనని బౌలింగ్ చేశాను. ఈ క్రమంలోనే తొలి రెండు బంతులను కూడా వైడ్ లుగా వేశాను. తర్వాత మూడో బంతిని ఫుల్ టాస్ గా విసిరాను. అప్పుడు ధోనీ నా దగ్గరికి వచ్చి నన్ను చూడటం మానేసి బౌలింగ్ చేయి అంటూ అన్నాడు. సహజసిద్ధంగా బౌలింగ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అప్పుడు అతనికి కావాల్సిన విధంగానే బౌలింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇక అప్పటినుంచి మహేంద్ర సింగ్ ధోనీ నా పేరు గుర్తు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా పిలవాలంటే పేరుతోనే పిలిచేవాడు అంటూ కొండప్ప రాజ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: