నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి  సీజన్లోనే కప్పు కొట్టాలని గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంతో ఆశతో కనిపిస్తే.. మరోవైపు మొదటి సీజన్లో కప్పుకొట్టి ఇప్పటివరకు పేలవా ప్రదర్శనతో నిరాశపరిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 ఏళ్ళ తర్వాత కప్పు కొట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఎంతో గ్రాండ్గా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ జరగడానికి ముందు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయంపై ఒక అంచనా వేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అని చెప్పాలి. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు మాజీ ఆటగాళ్లు ఏ జట్టు గెలుస్తుంది అనే విషయంలో చెప్పే మాటలు నిజమవుతు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సురేష్ రైనా కూడా మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే గుజరాత్ ఐపీఎల్ విన్నర్ అని చెప్పాడు.


 ఎవరికీ చెప్పిందే జరిగింది అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్ టైటాన్స్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు గుజరాత్ జట్టు ఇప్పటికే ఐదు రోజుల విరామం దొరకడంతో వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉంది అని చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ ను కూడా తక్కువ అంచనా వేయాలేం అంటు తెలిపిన సురేష్ రైనా అటు గుజరాత్ టైటాన్స్  గెలుస్తుందన్న గట్టి నమ్మకం మాత్రం నాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగానే రైనా చెప్పినట్లుగా మెరుగైన ప్రదర్శన చేసిన గుజరాత్ జట్టు ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl