ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరికి ముగిసింది. లీక్ మ్యాచ్ ల నుంచి మొన్నటి ప్లే అఫ్ మ్యాచ్ ల వరకూ ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా  చేసిన ఐపీఎల్ ఇక నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో శుభం కార్డు పడింది. కాగా నిన్న గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది.



 ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అమిత్ షా విచ్చేశారు. అంతేకాదు ఇక లక్షా 25 వేల మంది ప్రేక్షకులను కూడా అనుమతించారు అని చెప్పాలి. ఇకపోతే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని విషయాలలో ప్రేక్షకులు సరికొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.. మ్యాచ్ ఫిక్స్ అయింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ఇది కాస్తా కాసేపటి వరకు సోషల్ మీడియా లో సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ప్రేక్షకులు ఇలా మ్యాచ్ ఫిక్స్ అయింది అని ఆరోపణలు చేయడానికి వెనుక కారణాలు కూడా లేకపోలేదు. సాధారణంగా ఇప్పటివరకు ఐపీఎల్ లో టాస్ గెలిచిన ప్రతి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటూ వచ్చింది అనే విషయం తెలిసిందే. అలా చేయడం వల్ల జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎంతోమంది కెప్టెన్లు తెలిపారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తే మ్యాచ్ ఫిక్స్ అయిందని అర్థమవుతుంది అంటూ అనుకుంటున్నారట. మ్యాచ్ చూస్తున్న అమిత్ షా గుజరాత్ గెలిస్తే విక్టరీ సింబల్ చూపించేందుకు ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ను ఫిక్స్ చేశారని హోమ్ గ్రౌండ్ కావడంతో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ తో బేరమాడినట్లు కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl