ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసింది. ప్రేక్షకులందరూ అంచనాలు పెట్టుకున్న దానికంటే ఎక్కువగానే ఎంటర్టైన్మెంట్ అందించింది. ఐపీఎల్ లోకి గుజరాత్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వడం తో ఐపీఎల్ పోటీ మరింత రసవత్తరంగా మారిపోయింది. ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు ప్లే ఆఫ్ వరకు పోరాడగా.. మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. హార్దిక్  పాండ్య తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో మరికొన్ని రోజులు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా.


 ఇకపోతే హార్దిక్ పాండ్యా ఈ ఏడాది కెప్టెన్ గుజరాత్  కు టైటిల్ అందించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు తరపున కొనసాగిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు అని చెప్పాలి. ఇలా ఒక ఆటగాడిగా హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఐదుసార్లు  టైటిల్స్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇలా సభ్యుడిగా అయినా కెప్టెన్గా అయినా ఎక్కువసార్లు టైటిల్స్ గెలిచిన జట్టు సభ్యుడిగా ఉన్న ఆటగాళ్ల వివరాలు ఏంటి అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇక ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం..రోహిత్ శర్మ మొత్తం లో ఆరు సార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్ గా ఉన్నాడు. ఢిల్లీ టైటిల్ గెలిచినా సమయంలో ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ ఇక కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కి 5 టైటిల్స్ అందించాడు. మొత్తంగా  ఆరు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా టాప్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున నాలుగుసార్లు.. ఇక ఇప్పుడు గుజరాత్ కి టైటిల్ అందించి ఐదుసార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్గా మారిపోయాడు. కిరణ్ పోలార్డ్ ఐదుసార్లు ముంబై ఇండియన్స్ తరఫున టైటిల్ గెలిచిన సభ్యుడిగా ఉన్నాడు. అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ తరఫున 3, చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు టైటిల్స్ గెలిచినా ప్లేయర్ గా ఉన్నాడు.  ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్గా.. ఆ తర్వాత లసిత్ మలింగ  ముంబై ఇండియన్స్ తరపున నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl