ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకరి గురించి చర్చించుకుంటున్నారు. అతనే హార్దిక్ పాండ్య. ఎందుకంటే అప్పటివరకూ కెప్టెన్సీలో అనుభవం లేని హార్దిక్ పాండ్యా సీనియర్ జట్లను సైతం ఓడిస్తూ జట్టును ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుపుతూ ఇక చివరికి ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు.  ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు ఫిట్నెస్ సమస్యలతో గాయాలతో సర్జరీలతో పూర్తిగా క్రికెట్కు దూరమైన హార్దిక్ పాండ్యా బాగా రాణించడం కష్టం అని అందరూ అనుకున్నారు.


 అయినప్పటికీ ఆటగాడిగా అద్భుతంగా రాణించడమే కాదు ఒకవైపు కెప్టెన్గా కూడా తన వ్యూహాలతో జట్టును ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు. ఎక్కడ ఒత్తిడికి లోనుకాకుండా ఎంతో కూల్గా కెప్టెన్సీ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా వేలంలో గుజరాత్ జట్టులోకి ఆటగాళ్లను తీసుకున్నప్పుడు అందరూ విమర్శలు చేశారు. ఒకరిద్దరు తప్ప పేరుమోసిన బ్యాట్స్మెన్లు గాని బౌలర్లు గాని గుజరాత్ జట్టులో ఎవరూ లేరు. మెగా వేలంలో గుజరాత్ యాజమాన్యం సరైన వ్యూహాలను అమలు చేయలేదు.


 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ జట్టు బాగా రాణించడం కష్టమే.. ఇక జట్టులో స్టార్ ప్లేయర్ లేకుండా ఆ జట్టు విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించలేదు అంటూ విమర్శలు చేశారు. కానీ హార్దిక్ పాండ్యా ఆ విమర్శలను పట్టించుకోకుండా జట్టుకు అన్నీ తానే ముందుకు నడిపించి టైటిల్ విజేత గా నిలిపాడు అని చెప్పాలీ. ఇటీవల ఇదే విషయంపై మాట్లాడినా హార్థిక్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా జట్టులో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్లు లేరు అని ఎంతోమంది అన్నారు. ఇక క్వాలిటీ బౌలర్లు కూడా లేరని క్రిటిక్స్ విమర్శలు చేశారు. కానీ వీటన్నింటినీ అధిగమించి ఇక ఇప్పుడు మా దగ్గర ట్రోఫీ ఉంది అంటూ జట్టుపై విమర్శలు చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl