ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ. ఈ క్రమంలోనే మొన్నటి వరకు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన హార్థిక్ పాండ్య గుజరాత్ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఊహించని రీతిలో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొట్టింది. చివరికి అన్ని జట్లను చిత్తు చేస్తూ టైటిల్ విన్నర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్లోనే గుజరాత్ జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.


 ఒత్తిడిలో కూడా ఎక్కడ తడబాటు  లేకుండా ఎంతో కూల్గా కెప్టెన్సీ చేయడంపై అందరూ ఫిదా అవుతున్నారు అనే చెప్పాలి.. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్  అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎంతోమంది. కాగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై స్పందించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్సి స్కిల్స్ కలిగి ఉన్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడూ. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా భారత జట్టుకు కెప్టెన్ గా మారుతాడు.. ఇది నా అంచనా మాత్రమే కాదు అందరి అంచనా కూడా ఇదే. ఐపీఎల్ సీజన్ లో బ్యాట్ తో పాటు బంతితో కూడా అతను రాణించాడు.


 ఐపీఎల్ ప్రారంభానికి ముందు అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడా అని అనుమానం ప్రతి ఒక్కరికీ ఉంది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ అతను తన సత్తా ఏంటో చూపించాడు. ఆటగాడికి నాయకత్వ లక్షణాలు ఉంటే భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే కెప్టెన్సి రేసులో  ఉన్నారు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక సునీల్ గావస్కర్ చెప్పినట్టుగానే ధోని దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్న హార్థిక్ పాండ్యా ధోని వారసుడిగా టీమిండియా కెప్టెన్సి చేపడితే  బాగుంటుంది అని అభిమానులు కూడా అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: