ఐపీఎల్ 2022 సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గుజరాత్ టైటాన్స్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఊహించని విధంగా పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతూ రావడమే కాదు ఏకంగా ఐపీఎల్ టైటిల్ విజేత కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ పై ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గుజరాత్ విజయంలో ఎవరో ఒకరు కాదు ఏకంగా జట్టు సమిష్టిగా కృషి కారణంగానే విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇలాగే గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కూడా అవసరమైన సమయంలో మంచి పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడూ. మరీ ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో 19 బంతుల్లో 32 పరుగులు చేసి  జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. లీగ్ మ్యాచ్లలో కూడా ఫినిషర్ గా దంచి కొట్టాడు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన డేవిడ్ మిల్లర్ తాను బాగా రాణించడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఎంతో కష్టపడే వాడిని అంటూ తెలిపాడు.



 ఈ క్రమంలోనే స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు నా బ్యాటింగ్ తీరు మార్చుకునేందుకు మూడు నాలుగేళ్లు ప్రత్యేకంగా సన్నద్ధమైనట్లు తెలిపాడు డేవిడ్ మిల్లర్. ఇక ఈ  టోర్నీలో చాలా సార్లు విఫలమయ్యానని.. కానీ ఈ సారి ఎలాగైనా రాణించాలి అని  నిర్ణయించుకున్నాను అంటూ తెలిపాడు. మిడిలార్డర్లో  బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి.. అంతేకాకుండా రన్ రేట్ ను సమన్వయం చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. అలాంటప్పుడు మైదానంలో ప్రశాంతంగా ఉంటూ నా పని నేను చేసుకుంటూ పోవాలి అని నిర్ణయించుకున్నాను. ఈ సీజన్లో నేను నా ఆట బాగా ఆస్వాదించాను. నా బ్యాటింగ్ లో మార్పులు చేసుకొని ఇక ఇప్పుడు స్పిన్ బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నా అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl