భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని దిగ్గజ కెప్టెన్ అన్న  విషయం తెలిసిందే. అయితే అతను అంత గొప్ప కెప్టెన్గా ఎదగడానికి కారణం తుది జట్టు ఎంపిక విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడమే. ఎవరైనా ఆటగాడి ప్రదర్శన జట్టుకు మైనస్ గా మారుతుంది అంటే నిర్మొహమాటంగా అతన్ని తుది జట్టు నుంచి తప్పించే వాడు ధోని. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు కూడా చెప్పారు. ఇటీవలే టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చాడు.



 ధోని తనును జట్టు నుంచి తప్పించిన సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాలీ అనుకున్నాను అంటూ తెలిపాడు. 2008లో ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో రిటైర్మెంట్ ఆలోచన మదిలో మెదిలింది. అప్పటికే టెస్టు సిరీస్లో పురోగమనం 150 పరుగులు చేశాడు. కానీ వన్డేల్లో మంచి స్కోర్ చేయలేకపోయా.. దీంతో ధోనీ నన్ను పక్కన పెట్టాడు. ఇక అప్పుడు వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆలోచన వచ్చింది. టెస్ట్ క్రికెట్ లో మాత్రం కొనసాగాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించకుండా సచిన్ నన్ను అడ్డుకున్నాడు.. ఇది నీ జీవితంలో ఒక చెడు దశ.. కాస్త సమయం వేచి చూడు.. ఈ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లి ఏం చేయాలో ఆలోచించంచి నిర్ణయం తీసుకో అంటూ సలహా ఇచ్చాడు.


 అదృష్టవశాత్తు  సచిన్ మాటలు విన్న నేను ఆ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించ లేదు అంటూ చెప్పుకొచ్చాడు సెహ్వాగ్. సాధారణంగా ఆటగాళ్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు సవాళ్లను ఇష్టపడే వారు.. మరొకరు కఠిన పరిస్థితుల్లో సరదాగా ఉండేవారు. ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఒకరు అతను అన్ని విమర్శలను వింటాడు. మైదానంలో పరుగులు చేయడం ద్వారా అవి తప్పు అని నిరూపించాడు. కొందరు విమర్శలను అస్సలు పట్టించుకోరు ఏం చేయాలో వారికి బాగా తెలుసు నేను అలాంటి ఆటగాడిని విమర్శలను పట్టించుకోకుండా ఆట కొనసాగించానంటూ చెప్పుకొచ్చాడు సెహ్వాగ్. 2018 లో వన్ డే మ్యాచ్ లలో 06, 33, 14, 13 స్కోరు చేసి విఫలం అవడంతో వీరేంద్ర సెహ్వాగ్ ని  పక్కనపెట్టాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: