ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ధోనీ ఎప్పుడు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించడు అన్న విషయం తెలిసిందే. కానీ ధోనికి సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది సెన్సేషనల్  గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు అభిమానులందరినీ కూడా షాక్ కి గురి చేసే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ వార్త సెన్సేషనల్ గా   మారిపోయింది. చెక్ బౌన్స్ అయిన కేసులో మహేంద్ర సింగ్ ధోనీ పేరు పై బీహార్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.


 వివరాల్లోకి వెళితే.. ధోని టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న సమయంలో బీహార్కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా ఉన్నాడు  ఇది ఒక ఫర్టిలైజర్స్  ఉత్పత్తి చేసే సంస్థ కావడం గమనార్హం. ఇక ధోనీ ప్రమోటర్ గా ఉన్న కంపెనీ నుంచి 30 లక్షల విలువచేసే ఎరువులను కొనుగోలు చేసింది ఎస్.కె ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ. న్యూ ఇండియా కంపెనీ ఎరువులను డెలివరీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎరువుల లో నాణ్యత లోపించిందని డీలర్ ప్రొవైడర్ కు అనుగుణంగా లేదు అంటూ ఎస్.కె ఎంటర్ప్రైజెస్ ఆరోపించడం గమనార్హం.


 ఈ క్రమంలోనే న్యూ ఇండియా కంపెనీ ఎరువులను వాపస్ తీస్కొని 30 లక్షల చెక్కును సదరు ఎస్.కె ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీకి అందజేసింది. అయితే చెక్కులు బ్యాంకులో వేయగా అది బౌన్స్ కావడం గమనార్హం. దీంతో సదరు సంస్థ న్యూ ఇండియా గ్లోబల్ సంస్థ ప్రమోటర్ గా ఉన్న ధోనీ తో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపారు. ఇటీవలే  వారి పేరు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెగుసరాయ్ కన్జ్యూమర్ కోర్టు ఇక దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను జూన్ 28వ తేదీన వాయిదా వేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: