ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్  తరపున ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ ఎంత విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బౌలర్ల పై సిక్సర్లతో విరుచుకుపడుతూ వీరవిహారం చేశాడు. ప్రతి  మ్యాచ్ లో కూడా తనదైన ఫినిషింగ్ ఇచ్చి అదరగొట్టాడు అని చెప్పాలి. ఐపీఎల్లో ఈ ఏడాది అతి పెద్ద సిక్సర్  కొట్టింది కూడా లివింగ్ స్టోన్ కావడం గమనార్హం.. ఇక ఇటీవల ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో ఇంగ్లాండులోని టీ20 బ్లాస్ట్ లో పాల్గొంటున్నాడు.


 ఇక వేదిక ఏదైనా అతని విధ్వంసం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో కూడా అదే టెంపోను కొనసాగిస్తూ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టోర్నీలో భాగంగా లంక షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు లివింగ్ స్టోన్. ఇక బౌలర్లపై జాలీ దయా చూపించకుండా నిర్ధాక్షణ్యంగా భారీ సిక్సర్లతో చుక్కలు చూపిస్తూన్నాడు. ఇలా లివింగ్ స్టోన్ కొడుతున్న సిక్సర్ల కు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇటీవల టీ20 బ్లాస్ట్ లో భాగంగా లంక షైర్, దెర్బీ షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లివింగ్ స్టోన్ 46 బంతుల్లో 77 పరుగులు చేసాడు. లివింగ్ స్టోన్ కొట్టిన ఒక సిక్సర్ మాత్రం ఆటకు అంతరాయం కలిగించింది అని చెప్పాలి. ఏకంగా బిల్లింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గర పడడంతో బంతి ఎక్కడ పడిందో దొరకలేదు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ కన్స్ట్రక్షన్ పనిలో ఉన్న బిల్డర్లు సైతం పని ఆపేసి బంతి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో  వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: