వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టు తరఫున ఎంత డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా కొనసాగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాకు సేవలందించిన వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక దూకుడైన ఆటతీరుకు మారుపేరైన వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఎప్పుడూ అదరగొడుతూ ఉండేవాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నాడు.


 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ తన కెరియర్లో ఎదురైన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో సందర్భంగా తాను పేలవా ప్రదర్శన చేయడంతో కెప్టెన్ ధోనీ తనను పక్కన పెట్టడం తో ఎంతో కలత సునందను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కాలంలో ఆసియాకప్ కు  తనకి నువ్వు సెలెక్ట్ చేయాలా వద్దా అనే విషయంపై సెలెక్టర్స్ మాట్లాడానని తెలిపారు వీరేంద్ర సెహ్వాగ్. తాను అన్ని మ్యాచ్లు ఆడే అట్లయితే ఎంపిక చేయండి లేదంటే వద్దు అంటూ సెలెక్టర్లను నేను ముందే చెప్పాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.


 ఏం చేయాలనుకుంటున్నావ్ అంటూ అప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్న కృష్ణమాచారి శ్రీకాంత్ నన్ను అడిగితే.. నేను మంచి టచ్ లో ఉన్నప్పుడు నాకు జట్టులో స్థానం లేదు.. నేనెం చేస్తాను అంటూ సమాధానం చెప్పాను. ఇప్పుడు ఆసియా కప్ లో అన్ని మ్యాచ్లు ఆడుతా అని అనుకుంటేనే ఎంపిక చేయండి లేదంటే జట్టులోకి తీసుకోవద్దు అంటూ కరాఖండిగా చెప్పేశా. ఇక ఇదే విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కెప్టెన్ ధోనీ తో మాట్లాడాడు. ఇక ధోని వచ్చి నువ్వు ఆడతావు అంటూ చెప్పాడు. ఇక ఆ తరువాత చాలా కాలం పాటు క్రికెట్ ఆడానుఅంటూ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: