మిస్టర్ కూల్ కెప్టెన్సికి మహేంద్ర సింగ్ ధోనీ మారుపేరు అన్న విషయం తెలిసిందే. విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం మహేంద్రసింగ్ ధోని కి అస్సలు తెలీదు.. విజయం వచ్చిన ఓటమి వచ్చిన ధోని మొహంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వే కనిపిస్తుంది తప్ప ఎక్కడా పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోవడం మాత్రం కనిపించదు అని చెప్పాలి. ఇలా మహేంద్రసింగ్ ధోని లోని  ఇలాంటి తత్వమే ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది.


 ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని ఇలా ఎలాంటి హావభావాలను చూపించకపోవడం పై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని లో ఉన్న ఒక లక్షణం నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని కొన్ని సార్లు అదే నాకు నచ్చలేదు అంటూ వ్యాఖ్యానించాడు. ఒక త్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్లో మేము అద్భుతంగా ఆడి టైటిల్ను గెలిచాము. ఆ సమయంలో ధోనీ ఏమీ మాట్లాడలేదు.. పెద్దగా సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. ఎలాంటి ఎమోషన్స్ చూపించక పోవడమే కాదు మ్యాచ్ పూర్తయ్యాక టోపీ తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చి ఒక మూలకు వెళ్లి నిలబడ్డాడు.


 ఇక ఆ తర్వాత సీజన్లో ఒక మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయామూ. అప్పుడు కూడా ధోని ఏం మాట్లాడలేదు. ఎమోషన్ లేకుండా నిలబడ్డాడు. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ క్షణం ధోని అసలు మనిషేనా అని అనిపించింది. విజయాలు వచ్చినప్పుడు ఉప్పొంగి పోకపోయినా.. ఓడిపోయినప్పుడు కాస్త ఫీల్ అవ్వాలి కదా. అలాంటి సందర్భాల్లో ఒకేలా ఉండడం ఏంటి అని అనుకున్నాను. కానీ ధోని సక్సెస్ కి ఇదే కారణమని ఆ తర్వాత తెలిసింది. ధోని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటూ బద్రినాథ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: