టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన కెరీర్ లోని పలు విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 2020 - 21 ఈ సమయంలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టైం లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవలే పంచుకున్నారు సీనియర్ రవిచంద్రన్ అశ్విన్. కాగా ఈ పర్యటనలో టీమిండియా వరుసగా రెండోసారి ఆసీస్ జట్టు పై సొంత గడ్డ మీదనే ఓడించడం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక గబ్బ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది భారత జట్టు.


 ఈ క్రమం లోనే  సిడ్నీ టెస్టులో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల చెప్పుకొచ్చాడు. సిడ్నీ టెస్టులో నేను విహారి బ్యాటింగ్ చేస్తున్న సమయం లో మా సమస్యలు ఏమిటో అర్థం చేసుకున్నామూ. అతను తొడ కండరాల గాయం కారణంగా దూకుడుగా ఆడ లేకపోతున్నాడు. నేనేమో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొ లేకపోయాను. ఇద్దరం కలిసి ఆడాలి అని అనుకున్నామూ.. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లను అతను ఆడితే నేను స్పిన్ ఎదుర్కొన్నాను. ఇక ఆ టెస్టులో నేను కూడా గాయాలు నొప్పితో ఎంతగానో బాధ పడ్డాను. ఒకానొక దశలో ఇక బాధ భరించలేక నేలపై పడుకుని దొర్లను అంటు అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలోనే పైకి లేవడానికి నా భార్య పిల్లలు సహాయం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇలా ఇక ఇన్నింగ్స్ మొత్తం పెయిన్ కిల్లర్లు వేసుకొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచాను అంటూ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అటు ఒకవైపు హనుమ విహారి మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు కోల్పోకుండా ఉండడం వల్ల టీమిండియాకు విజయం వరించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: