ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. ఇక మొదటి సీజన్లోనే టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఇక అంతా జరిగిపోయింది. కానీ ఇంకా ఐపీఎల్ గురించి చర్చ మాత్రం ముగిసిపోలేదు. మరీ ముఖ్యంగా గుజరాతి జట్టును టైటిల్ విన్నర్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా హార్దిక్ పాండ్యా ప్రతిభ పై ప్రశంసల వర్షం కురిపించకుండా ఉండలేకపోతున్నారు.


 ఎందుకంటే సరిగ్గా ఐపీఎల్ ముందు వరకు టీమిండియాకు దూరమై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా బాగా రాణించడమే గొప్ప అనుకుంటే ఒక వైపు ఆల్రౌండ్ ప్రదర్శన చేయడంతో పాటు తన కెప్టెన్సీతో గుజరాత్ జట్టుకు టైటిల్ అందించడం అమోఘం అంటూ పొగడ్తలతో ముంచెస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే విషయంపై గుజరాత్ జట్టు యువ ఆటగాడు రవి సాయి కిషోర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ప్రశంసలు కురిపించాడు. ఏకంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని పోల్చాడు యువ ఆటగాడు.


 ధోని, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ధోనీ లాగానే హార్దిక్ కూడా తమ జట్టులోని ఆటగాళ్లు కు మద్దతుగా నిలిచి అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటాడు. హార్దిక్ పాండ్యా ధోని లాగే గొప్ప కెప్టెన్ అవుతాడు. అందుకే అతన్ని ధోనీ జూనియర్ వర్షన్ గా అభివర్ణిస్తూ ఉంటాను.  ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నాకు బెస్ట్ సీజన్ అని చెప్పాలి. వచ్చే సీజన్లో మరింత మెరుగ్గా రాణిస్తా. ఇక నెట్స్ లో ధోనీకి బౌలింగ్ చేయడం అతనితో మాట్లాడటం ఎంతో అనుభూతిని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో  సాయి కిషోర్ చెన్నై సూపర్ కింగ్ కి ప్రాతినిధ్యం వహించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: