ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా ఎంతలా సత్తా చాటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమె కాదు ఒక ఆటగాడిగా కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చివరికి మొదటి సీజన్లో నే గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్గా టైటిల్ విజేత గా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై ఇప్పటికి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు చర్చించుకుంటున్నారు. అయితే గత ఏడాది ఐపీఎల్ సీజన్ వరకు ముంబై ఇండియన్స్ లో కొనసాగాడు హార్దిక్ పాండ్యా.


 ఆ జట్టు విజయంలోనూ కీలకపాత్ర వహించాడు. కానీ గత సీజన్లో పేలవ ప్రదర్శన చేయడం తో అతన్ని వదులుకుంది ముంబై ఇండియన్స్. చివరికి గుజరాత్ అతని దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించి చివరికి టైటిల్ కూడా గెలుచుకుంది. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా చాలా కూల్ కెప్టెన్ నేను బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్ నుంచీ అతన్ని చూస్తూ ఉన్నా.. అతను కెప్టెన్ కావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది.


 ముంబై ఇండియన్స్ అనవసరం గా అతని వదులుకుంది. అతను మా జట్టుతో ఉండి ఉంటే బాగుండేది అంటూ షేన్ బాండ్ చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం అతను ఒక గొప్ప కెప్టెన్గా ఆల్రౌండర్గా కూడా సత్తా చూపించాడు. ఐపీఎల్ తరహాలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ కు టీమ్ ఇండియా తరఫున అతను అద్భుతంగా రాణించాడు అంటూ జోస్యం చెప్పాడు షేన్ బాండ్. ఇటీవలే ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: