గౌతం గంభీర్.. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో అత్యుత్తమ సేవలు అందించిన ఈ ఆటగాడు.. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఐపీఎల్ ద్వారా క్రికెట్ కి దగ్గరగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కత నైట్ రైడర్స్ జట్టు లో కొనసాగిన గౌతం గంభీర్ ఆ జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత కాలంలో కెప్టెన్సీ నుంచి తప్పుకునీ సాదాసీదా ఆటగాడిగా కూడా కొనసాగాడు. ఇకపోతే ఇక ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిజెపి పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.


 అయితే గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అటు ఐపీఎల్ తో సంబంధాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్నటివరకు కామెంటేటర్ గా కొనసాగిన గౌతం గంభీర్ ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం లక్నో జట్టుకి మెంటార్ గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. ఇలా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా గౌతం గంభీర్ ఐపీఎల్ లో భాగం అవుతూ ఉండడం పై కొంత మంది పెదవి విరుస్తున్నారు అని చెప్పాలి. కేవలం డబ్బు కోసమే గౌతం గంభీర్ ఇలా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవల మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన గౌతం గంభీర్  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.  నేను డబ్బుకోసమే ఐపీఎల్ లో ఇంకా కొనసాగుతున్న ను అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో నేను 5000 మందికి భోజనాలు పెడుతున్నారు. దీని కోసం నెలకు 25 లక్షలు అవుతుంది. ఏడాదికి 2.75 కోట్లు నా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను. మరో 25 లక్షలు పెట్టి లైబ్రరీ కూడా కట్టించా. ఎంపీ లాడ్స్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. వీటన్నింటికీ ఖర్చు పెట్టడానికి మా ఇంట్లో డబ్బుల చెట్టు లేదు కదా అందుకే ఐపీఎల్ లో పనిచేస్తున్న సంపాదిస్తున్న డబ్బులతో ఐదు వేల మందికి అన్నం పెడుతున్న ఇలా ఐపీఎల్తో కొనసాగడానికి ఎలాంటి సిగ్గుపడటం లేదు నా అంతిమ లక్ష్యం ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడమే అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl