న్యూజిలాండ్ క్రికెట్ ని కొత్త పుంతలు తొక్కించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఒత్తిడిలో కూడా ఎంతో కూల్గా కెప్టెన్సీ చేస్తూ ప్రశంసలు అందుకోవడమే కాదు న్యూజిలాండ్ జట్టును 2019 వన్డే ప్రపంచకప్లో 2021 టీ20 ప్రపంచకప్ లో కూడా ఫైనల్ వరకు తీసుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక న్యూజిలాండ్ జట్టును వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేతగా కూడా నిలిపాడు కేన్ విలియమ్సన్. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం కేన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్ కొనసాగుతూనే  ఉంది. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా  జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేక పోవడమే కాదు ఒక ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు కేన్ విలియమ్సన్.


 13 మ్యాచ్ లలో కేవలం 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ముగిసింది ఇక ఇప్పుడు న్యూజిలాండ్ కు మళ్ళీ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అటు కేన్ విలియమ్సన్ చెత్త ప్రదర్శన మాత్రం కంటిన్యూ అవుతోంది. తొలి టెస్టులో తొలి రోజు ఆటలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయినా కేన్ విలియమ్సన్ రెండో రోజు అయినా బాగా రాణిస్తాడు అనుకుంటే 15 పరుగులు మాత్రమే చేసి మళ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానులందరూ తీవ్ర నిరాశ చెందుతున్నారు.


 అయితే ఐపీఎల్లో సరే ఇప్పుడు న్యూజిలాండ్  తరపున కూడా ఇలాంటి ప్రదర్శన చేయడంతో అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. జట్టును ముందుండి నడిపించాల్సిన నువ్వే ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తే ఇక మిగతా ఆటగాళ్లు ఎలా బాగా రాణించగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు అని చెప్పాలి. ఇక పోతే వచ్చే ఏడాది సన్రైజర్స్ యాజమాన్యం అటు కేన్ విలియమ్సన్ ను వదిలేసుకునే ఆలోచనలో ఉంది అన్న చర్చ కూడా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: