ప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతున్న దినేష్ కార్తీక్ ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా కు దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తన కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కామెంటేటర్ గా కొనసాగడమే బెటర్ అంటూ భావించారు. కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా 2022 ఐపీఎల్ సీజన్ లో బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయతీరాలకు నడిపించడంలో కీలక పాత్ర వహించాడు.


 ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ తనలో దాగివున్న ఫినిషెర్ ను చూపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ ప్రదర్శన చూసిన తర్వాత అతన్ని వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా ఎక్కువ అయ్యాయి. అయితే అటు దినేష్ కార్తీక్ ప్రదర్శన పై అటు టీమిండియా సెలెక్టర్లు కూడా ఆకర్షితులయ్యారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఆడబోయే టి20 సిరీస్ కోసం దినేష్ కార్తీక్ కు జట్టులో స్థానం కల్పించారు.


 ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ టీమిండియాలో చోటు దక్కించుకోవడం పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  దినేష్ కార్తీక్ భారత జట్టులోకి వస్తాడు. అయితే అతను గతంలో  ధోని పోషించిన పాత్రను పోషించాల్సి ఉంటుంది. జట్టు కోసం సెలెక్టర్లు దేనిగురించి వెతుకుతున్నారో ఇక దినేష్ కార్తీక్ అతని ప్రదర్శనలో అది చూపించాలి అంటూ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించాడు. ఇక ధోనీ లాగానే దినేష్ కార్తీక్ టీమిండియాలో ఫినిషర్ పాత్రను పోషించాలి అంటూ సూచించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఇప్పుడు టీమిండియా తరఫున ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl