మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు జరిగిన సంఘటనలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అదే సమయంలో ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది  ఇప్పటివరకు క్రికెట్ ప్రేక్షకులు ఎవరూ కూడా బ్యాట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడటం చూసి ఉండరు. కానీ ఇటీవలే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాత్రం ఏకంగా ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ప్రస్తుతం ఇంగ్లండ్  న్యూజిలాండ్ మధ్య  టెస్ట్ సిరీస్ జరుగుతుంది.  లార్డ్స్ లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేసిన మ్యాజిక్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.



 లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టులో ఏకంగా సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు మాజీ కెప్టెన్ జో రూట్. 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్మన్గా కూడా చరిత్ర సృష్టించాడు. ఇక జో రూట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక మ్యాజిక్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. అందరూ అవెంజర్స్ సినిమా చూసే ఉంటారు. అందులో థార్ పాత్ర హ్యామర్ ని ఒక చోట నిలబెట్టడం.. తర్వాత కావలసినప్పుడు అక్కడి నుంచి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన మ్యాచ్లో కూడా 87 పరుగుల వద్ద జో రూట్ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న  సమయంలో ఏకంగా బ్యాట్ ను  మైదానంలో నిలబెట్టాడు.


 దీంతో ఎలాంటి సపోర్ట్ లేకుండానే బ్యాట్ నిటారుగా నిలబడింది. ఇక బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మళ్ళీ ఎప్పటిలాగానే బ్యాట్ ని పట్టుకున్నాడు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారిన పోవడంతో ప్రస్తుతం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అని చెప్పాలి. ఇది ఎలా సాధ్యమైంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే పిచ్ పై ఇలా బ్యాట్ నిలబడటానికి కారణం బ్యాట్ చివరిలో ప్లాట్ గా ఉండడమే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bat