ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు రిషబ్ పంత్. ఇక భారత క్రికెట్లో కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మెరుపులు మెరిపించడం తో అతను అసలుసిసలైన ధోని వారసుడు అంటూ ఎంతోమంది చర్చించుకున్నారు. ధోని లాగే వికెట్ కీపింగ్ చేయడం అతని లాగానే మిడిలార్డర్లో బ్యాటింగ్ కు రావడం చూసి అందరూ టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడు అని భావించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఆ తర్వాత మాత్రం మళ్లీ పుంజుకుని ఇక టీమిండియా ఆటగాడిగా ఎదుగుతున్నాడు.



 ఇక ఒకప్పుడు తన కీపింగ్ సామర్థ్యంతో అందరిని  నిరాశపరిచిన పంత్.. ఇటీవలి కాలంలో మాత్రం కీపింగ్ లో కూడా అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రిషబ్ పంత్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడూ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ కావడానికి కారణం ఎవరు.. ఎవరి స్ఫూర్తితో వికెట్ కీపింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అన్న ప్రశ్న దాదాపు ప్రేక్షకులు అందరిలో వచ్చి ఉంటుంది అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు రిషబ్ పంత్.


 తాను వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్గా  కావడానికి కారణం మా నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మా నాన్న కూడా వికెట్ కీపర్ కావడం వల్లే చిన్నతనం నుంచే నేను కూడా వికెట్ కీపర్ గా మారాలని నిర్ణయించుకున్నాను.  అలాగే ఆట కొనసాగిస్తూ వచ్చాను. ఇక నా వికెట్-కీపింగ్ బాగుంటుందో లేదో నాకు తెలియదు. కానీ ప్రతిరోజూ అద్భుతమైన కీపింగ్ చేసేందుకు 100% ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇక నా కెరీర్ మొత్తం ఎప్పటికీ నేను వికెట్కీపర్ బ్యాట్స్మన్ గానే కొనసాగుతాను అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇక రిషబ్ పంత్  చెప్పిన మాటలతో అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: